మేం జోక్యం చేసుకోలేం.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్ట్..
మధ్యప్రదేశ్ లో 22 మంది ఎమ్మెల్యేల రాజీనామా తరువాత, కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర శాసన సభలో బలపరీక్ష ద్వారా కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్
భోపాల్: మధ్యప్రదేశ్ లో 22 మంది ఎమ్మెల్యేల రాజీనామా తరువాత, కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర శాసన సభలో బలపరీక్ష ద్వారా కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బెంగళూరులో బందీలుగా ఉంచారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసిందని బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది.
Read Also: బీఎస్-6 వాహనాలు వచ్చేస్తున్నాయ్..!!
కాగా తిరుగుబాటు చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురి రాజీనామాలను శాసన సభ స్పీకర్ ఎన్‌పి ప్రజాపతి అంగీకరించారు. కాగా మిగిలిన పదహారు మందిని బలపరీక్షకు అనుమతించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మిగిలిన పదహారు మందిని బలపరీక్షకు అనుమతించాలని, వారిని బందీలుగా ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read: కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి ఊరట
16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను జడ్జీల ఛాంబర్ ముందు హాజరుపర్చడానికి బీజేపీ తరఫున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదిందించినప్పటికీ కోర్టు అభ్యర్థనను అంగీకరించలేదు. తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భోపాల్ కు రప్పించాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వారిని బలవంతం చేయవచ్చని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల రాజీనామాలను బీజేపీ బలవంతగా చేయించారని పేర్కొంది.
రాజ్యాంగ పరంగా న్యాయస్థానంలో మా విధులను మేము నిర్వర్తిస్తామని, తమ పరిధి తమకుఅంటుందని, జోక్యం చేసుకోలేమని జస్టిస్ డి వై చంద్రచూడ్ హేమంత్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.